telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ

వినాయక నిమజ్జనంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిపింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలి అని తెలిపింది.

హైకోర్టు కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి సూచింది. ప్రజల సెంటిమెంట్​ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలి అని హైకోర్డు సూచించింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వెల్లడించింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలి అంది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తాం అని హైకోర్టు వెల్లడించింది.

Related posts