telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఘంటసాలతో కలసి స్వరం కలిపిన ఎన్ .టి .ఆర్.

ఎన్ .టి. రామారావు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా 20 ఏప్రిల్ 1967లో విడుదలయ్యింది .

ఈ సినిమాలో ఎన్ .టి .ఆర్ , సావిత్రి , కృష్ణ కుమారి , రేలంగి , నాగభూషణం , సత్యనారాయణ ,ప్రభాకర రెడ్డి , అల్లు రామలింగయ్య , రాజబాబు మొదలైన వారు నటించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు టి .వి రాజు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది . అది రామారావు గారికి చెప్పగానే,’ ఓఎస్ .. అలాగే కానియ్యండి ‘ అన్నారు.

‘ఉమ్మడి కుటుంబం’ లో “తస్సాదియా తస్సాదియా తమాషైన” అనే పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాశారు. ఈ పాటను ఘంటసాలతో కలసి ఎన్ .టి .రామారావు పాడటం విశేషం. “ఉమ్మడి కుటుంబం” సినిమా పాటల రికార్డింగ్ సమయంలో ఘంటసాల మాష్టారు తోస్వరం కలిపి ఎన్.టి. రామారావు పాడుతున్న దృశ్యం చూడవచ్చు . ఇది అరుదైన ఫోటో.

ఈ ఫోటో లో ఎన్.టి.ఆర్., ఘంట సాల తో పాటు పాటల రచయిత కొసరాజు, సంగీత దర్శకుడు టి.వి. రాజు, నిర్మాత తివిక్రమరావు గారు కూడా ఉన్నారు.

Related posts