telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రోజురోజుకు సమాజంలో హింస పెరిగిపోతున్నది .. : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

Ex-president of India Pranab comments elections

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా రోజురోజుకు సమాజంలో హింస పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయత బహుళత్వం, భిన్నత్వాలకు ప్రతీక అన్నారు. నార్త్‌ఈస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఉపన్యసించారు. కోపాన్ని వ్యక్తీకరించే విధానాలు సామాజిక అల్లికను చిదిమేస్తున్నాయని చెప్పారు.

ప్రజలలో నెలకొన్న భయం, విశ్వాసం హింసకు మూలమని ప్రణబ్‌ అన్నారు. జాతీయ ప్రాధాన్యతగల అన్ని సమస్యలపై సహేతుకమైన బహిరంగ చర్చను ప్రోత్సహించాల్సి ఉందని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చర్చలు అంతరాయం కావని అన్నారు. బహిరంగ చర్చ ద్వారా వచ్చిన భిన్నాభిప్రాయాలలోని ముఖ్యమైన అంశాలను నిరాకరించలేమన్నారు. సమాజంలో హింస ఏ రూపంలో ఉన్నా బహిరంగ చర్చ ద్వారా దానిని దూరం చేయొచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకించి అణగారిన, సమాజానికి దూరంగా నెట్టివేయబడిన వారి భాగస్వామ్యానికి అహింసాయుత సమాజం హామీ ఇస్తుందన్నారు.

Related posts