telugu navyamedia
సినిమా వార్తలు

నా ఎదురుగానే నా గురించి తప్పుగా… హీరోయిన్ కామెంట్స్

Tara-Sutaria

బాలీవుడ్ నటి తారా సుతారియా నటిగా పరిచయమైన “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2” సినిమా ఇటీవలే విడుదలైంది. పునీత్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. అనన్య పాండే మరో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లినప్పుడు తారాకి ఓ వింత అనుభవం ఎదురైందట. తన పక్కన కూర్చొని ఉన్న ఇద్దరు అమ్మాయిలు… వారి పక్కన ఉన్నది తారా సుతారియా అనే విషయం తెలియక సినిమాలో ఓ సన్నివేశం చూసిన తరువాత ఆమె గురించి చెడుగా మాట్లాడారట. చివరకి సినిమా పూర్తై లైట్స్ ఆన్ చేసినప్పుడు.. తను ఆ ఇద్దరు అమ్మాయిల వైపు చూడగా.. వారు తనను చూసి షాక్ అయ్యారట. దీంతో తారా నవ్వేసి వెళ్లిపోయారట. ప్రస్తుతం ఈ బ్యూటీ “మర్జావా” అనే సినిమాతో పాటు తెలుగు హిట్ మూవీ “ఆర్ఎక్స్ 100” హిందీ రీమేక్ లో కూడా నటించనుంది.

Related posts