telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అది చైనీస్ వైర‌స్.. కరోనపై ట్రంప్‌ కామెంట్!

trump usa

చైనాలోని వుహాన్ న‌గ‌రంలో నోవెల్ క‌రోనా వైర‌స్‌ వ్యాప్తి చెంది అది క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించింది. దీంతో ఆ వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌19 వ్యాధిని చైనీస్ వైర‌స్ అంటూ ఆయ‌న సంబోధించారు. చైనీస్ వైర‌స్ వ‌ల్ల అమెరికా పరిశ్ర‌మ‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయంటూ ఆయ‌న ఘాటుగా స్పందించారు. దీనిపై డ్రాగ‌న్ దేశం ట్రంప్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది. ట్రంప్ వ్యాఖ్య‌లు స‌రైన రీతిలో లేనట్లు ఆరోపించింది.

క‌రోనా వ‌ల్ల ఎయిర్‌లైన్స్‌తో పాటు న‌ష్ట‌పోయిన‌ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు శ‌క్తివంత‌మైన స‌పోర్ట్ ఇస్తామ‌ని ట్రంప్ తాజాగా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే అదే ట్వీట్‌లో ఆయ‌న వివాదాస్ప‌ద మాట‌ను కూడా వాడారు. చైనీస్ వైర‌స్ వ‌ల్ల ప్ర‌భావానికి లోనైన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకుంటామ‌న్నారు. చైనా సీనియ‌ర్ దౌత్య‌వేత్త యంగ్ జేచీ .. క‌రోనాపై అమెరికా చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, కానీ ట్రంప్ కామెంట్స్ స‌రైన రీతిలో లేవ‌ని ఆయ‌న ఆ దేశ విదేశాంగ‌మంత్రితో పేర్కొన్నారు.

Related posts