telugu navyamedia
తెలంగాణ వార్తలు

రైతుల్ని విస్మరిస్తే పుట్టగతులుండవు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆన్లైన్ కాంగ్రెస్ సభ్యత్వం నమోదు కార్యక్రమ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని అన్నారు.

వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని, వేములవాడ ప్రజలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏ అని అన్నారు. ప్రజల సానుభూతితో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కాబోతున్నదని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ,ఆన్లైన్ కాంగ్రెస్ సభ్యర్థ నమోదు లు చేయించాలని కోరారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అన్ని మండలాల అధ్యక్షుడు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Related posts