telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఓయూ హాస్టల్‌లో విద్యార్థిని బెదిరించిన ఆగంతుకుడు

New couples attack SR Nagar

హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీ ఉమెన్స్ హాస్టల్ లోకి ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, కత్తితో బెదిరించాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంజినీరింగ్‌ కళాశాల మహిళా వసతిగృహం వెనుక వైపు నుంచి ఓ ఆగంతుకుడు చొరబడడ్డాడు. అదే సమయంలో ఓ విద్యార్థిని బాత్‌రూంకి వెళ్లింది. అది గమనించిన అతడు బాత్‌రూం బయట గడియ పెట్టి పైనుంచి బాత్‌రూం లోపలికి వెళ్లి విద్యార్థినికి కత్తి చూపించి బెదిరించాడు. ఆ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో మిగిలిన విద్యార్థులు రావడంతో అక్కడి నుంచి ఆమె సెల్‌ఫోన్‌ తీసుకొని పారిపోయాడు.

Related posts