telugu navyamedia
తెలంగాణ వార్తలు

గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.

ఇటీవ‌ల విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిచ్చిన హైకోర్టు… గురుకులాలు, వసతిగృహాలు తెరవొద్దని ఆగస్టు 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో గత నెల 1న రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ… గురుకుల విద్యా సంస్థలు మాత్రం తెరుచుకోలేదు.

Telangana: Reopening of residential schools safe bet in Covid lockdown,  feel officials

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నందున… గురుకులాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును మ‌రోసారి కోరారు. గురుకుల విద్యాలయాల్లో అన్ని వసతులు ఉన్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

గురుకుల విద్యాసంస్థల్లో ఎక్కువగా నిరుపేద విద్యార్థులు ఉన్నారని వివరించారు. దీంతో..వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ బోధన కొనసాగించేందుకు అనుమతిస్తూ హైకోర్టు సూచించింది.

Related posts