telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దశలవారీ భూసేకరణ అనేది ఎక్కడా ఉండదు…

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ… పోలవరం ఎత్తు తగ్గించే ఉద్దేశం లేనప్పుడు, ఈప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి అవసరమైన భూమిని తక్షణమే సేకరించాలి అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ చేసిన అసంబద్ధ, అవాస్తవ ఆరోపణలే నేడు ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా మారాయి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 45.72 మీటర్ల కన్నా తగ్గించేది లేదంటోన్న మంత్రి అనిల్, ఆర్ అండ్ ఆర్ ని దశలవారీగా చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉంది అన్నారు. 2018లోనే టీడీపీ ప్రభుత్వం ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షా 10 వేల 355 ఎకరాలు సేకరించింది. 2018లో కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంకాకేవలం 50 వేల ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఆర్ అండ్ ఆర్ కింద దశలవారీ భూసేకరణ అనేది ఎక్కడా ఉండదు. అలా చేస్తామని మంత్రి అనిల్ చెప్పడం, ముమ్మాటికీ ప్రజలను మోసగించడమే అవుతుంది. ప్రజలు జగనుకు 28ఎంపీలను ఇస్తే, వారంతా కేంద్రానికి గులాంగిరీ చేస్తున్నారు అని పేర్కొన్నారు. మరి ఈ విహాయం పై వారు ఏమైనా స్పందిస్తారా… లేదా అనేది చూడాలి.

Related posts