telugu navyamedia
వార్తలు సామాజిక

ఐబీఎంలో లక్ష మంది ఉద్యోగుల తొలగింపు .. కోర్టును ఆశ్రయించిన సీనియర్లు!

ibm employees

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపనీ ఐబీఎంలో గడచిన ఐదేళ్ల కాలంలో దాదాపు లక్ష మంది సీనియర్ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పనితీరు బాగానే ఉన్నా ఉద్యోగులను తొలగించడం అన్యాయమంటూ శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానాన్ని కొందరు ఉద్యోగులు ఆశ్రయించారు.కంపెనీని యువతరంతో నింపాలన్న ఉద్దేశంతోనే ఇది జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. కోర్టు రిజిస్ట్రార్ వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో ఐబీఎంలో పని చేసి తొలగించబడిన జొనాథన్ లాంగ్లే ఈ కేసును వేశారు. తన వయసు 61 సంవత్సరాలని, తనను కేవలం వృద్ధుడన్న కారణంతోనే తొలగించారని ఆయన ఆరోపించారు.

 ఉద్యోగుల తొలగింపు ఆరోపణలపై స్పందించిన ఐబీఎం ప్రతి సంవత్సరమూ మేము 50 వేల మంది ఉద్యోగులను నియమిస్తున్నామని తెలిపింది. వారికి శిక్షణ ఇచ్చేందుకు అర బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నామని పేర్కొంది. మాకు రోజుకు 8 వేల దరఖాస్తులు వస్తుంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సంస్థ భవిష్యత్తు కోసమే అని స్పష్టం చేసింది.

Related posts