telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీలాంటి కెప్టెన్ ను ఎప్పుడు చూడలేదు : గంభీర్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్‌వెల్(41 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ఈ ఆసీస్ స్టార్(28 బంతుల్లో 39) ఆకట్టుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లీసేన.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్తానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలోమాట్లాడిన భారత మాజీ ఓపెనర్ గంభీర్.. మ్యాక్సీ పెర్ఫామెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని చూసి షాకయ్యానన్నాడు. ‘మ్యాక్స్‌వెల్ రాణించడం ఆర్‌‌సీబీకి చాలా ముఖ్యం. ఆ జట్టు అతని కోసం భారీ స్థాయిలో డబ్బును ఖర్చు చేసింది. అలాగే ఎంతో నమ్మకం ఉంచింది. అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక మ్యాక్సీని ఆకాశానికెత్తిన గౌతం గంభీర్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. కోహ్లీ తీరుతో షాక్‌కు గురయ్యానన్నాడు. టాస్ సమయంలో ఏ కెప్టెన్ కూడా బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాటజీలను చెప్పరని, విరాట్ మాత్రం తన వ్యూహాలను వెల్లడించాడని విమర్శించాడు. ఇక టాస్ సమయంలో విరాట్ మాట్లాడుతూ ఫస్ట్ డౌన్‌లో షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ వస్తాడని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను గంభీర్ తప్పుబట్టాడు. నెంబర్ 3లో ఆడే ఆటగాడు ఎవరనే విషయాన్ని ఏ కెప్టెన్ చెప్పగా తాను చూడలేదన్నాడు. కెప్టెన్స్ ఎప్పుడు ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమే చెబుతారని, కానీ ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మెన్ పేరు చెప్పరని స్పష్టం చేశాడు.

Related posts