telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

హైదరాబాద్ : .. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు .. మార్గదర్శకాలు..

guidelines in celebrations of new year in hyd

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అధికారులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. అవి తప్పిన వారికి రూ.10వేల జరిమానా. 2020 వేడుకల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ క్రమంలో నగర సీపీ బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో హోటల్స్‌, పబ్‌లు, ఈవెంట్స్‌ నిర్వాహకులతో సమావేశమై మా ట్లాడారు. వేడుకల సందర్భంగా అందరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని.. ఒవవేళ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ శిఖా గోయెల్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మార్గదర్శకాలు :
* వేడుకల నిర్వాహకులు 10రోజుల ముందే పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాభద్రత చట్టం-2103 ప్రకారం వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌, పార్కింగ్‌ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్‌ రద్దీ తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. అశ్లీలం లేకుండా వేడుకలు నిర్వహించాలి.

* వేడుకల్లో 45 డెసిబెల్స్‌ మ్యూజిక్‌ శబ్ధం మించకూడదు. వేడుకల ప్రాంతానికి ఆయుధాలను అనుమతించవద్దు.ఆవరణ పరిమితికి మించి టిక్కెట్లను విక్రయించరాదు. పాసులు జారీ కూడా ఆవరణ పరిమితికి లోబడే ఉండాలి.

* సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలి. జంటల కోసం నిర్వహించే వేడుకల్లో మైనర్‌లను అనుమతించవద్దు. డ్రగ్స్‌, మత్తు పదార్థాలు లేకుండా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా పార్కింగ్‌ స్థలాల్లో విక్రయించే అవకాశం ఉండడంతో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి.

* మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసినా, డ్రగ్స్‌ తీసుకున్న వారిని అనుమతించి నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎైక్సెజ్‌శాఖ అనుమతి సమయం దాటిన తర్వాత మద్యం విక్రయించవద్దు. మందు బాబులు క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు నిర్వాహకులు డ్రైవర్లు, క్యాబ్‌లను ఏర్పాటు చేయాలి.

* టపాసులు కాల్చొద్దు. ఎలాంటి అపశృతులు జరిగినా నిర్వాహకులే బాధ్యత వహించాలి. వేడుకలు నిర్వహించేవారు తప్పని సరిగా కార్యక్రమాలు జరిగే ప్రవేశ మార్గంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ నేరమని సూచిక బోర్డులు పెట్టాలి. 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్‌ మించకూడదు. అది దాటితే డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ కింద పరిగణిస్తారు.

* డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌లో పట్టుబడితే వాహనం అక్కడికక్కడే సీజ్‌. రూ.10వేల జరిమానా, 6 నెలల పాటు జైలు. కొత్త సంవత్సరం మొదటి రోజు తప్పనిసరిగా పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ 3 నెలల పాటు సస్పెండ్‌.

Related posts