telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్-చైనా సరిహద్దులో అసలేం జరుగుతోంది?: ప్రశించిన రాహుల్

Rahul gandhi congress

వైద్య పరీక్షల  కోసం విదేశాలకు వెళ్లిన తల్లి సోనియాగాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చైనాను చూసి ప్రధాని మోదీ ఎందుకంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు.

సరిహద్దులో ఎవరూ ప్రవేశించలేదని మోదీ ఒకసారి చెప్పారని, కానీ అదే సమయంలో చైనాతో సంబంధం ఉన్న బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత దేశాన్ని చైనా ఆక్రమించిందని రక్షణ మంత్రి చెప్పారని తెలిపారు.

ఇప్పుడేమో ఎటువంటి చొరబాట్లు జరగలేదని హోం మంత్రి చెబుతున్నారని అన్నారు. సరిహద్దులో అసలేం జరుగుతోందని రాహుల్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం భారత ఆర్మీతో ఉందా? లేక, చైనాకు మద్దతు ఇస్తోందా? అని ప్రశ్నించారు.

Related posts