telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆయన గ్లోబల్ లీడర్ .. పొన్నం పై ఎమ్మెల్యే సుమన్ ఫైర్

MLA Balka Suman praises Padmarao

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై పొన్నం చేసిన వ్యాఖ్యలను సుమన్‌ ఖండించారు. కేటీఆర్ బంజారాహిల్స్ లీడర్ కాదని ఆయన గ్లోబల్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ మహానగరానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకు వచ్చింది కేటీఆర్ అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ లను ఎందుకు పూర్తి చేయలేకపోయిందో చెప్పాలని బాల్క సుమన్ ప్రశ్నించారు. అప్పుడేందుకు పొన్నం ప్రభాకర్ కృషి చేయలేకపోయారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

Related posts