telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

55 లక్షల ఇల్లు గిఫ్ట్… ప్లాట్ ఫార్మ్ సింగర్ కు సల్మాన్ బహుమతి

Salman-Khan

ఇటీవల కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రను మొండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. వెంటనే సూపర్ స్టార్ సింగర్ షోకి ఆమెను అతిధిగా పిలిపించారు. జడ్జ్ గా ఉన్న హిమేష్ రేషమ్మియా ఆమె గాత్రానికి ఫిదా అయిపోయాడు. వెంటనే ఆమె పాడిన పాటను రికార్డింగ్ చేయించాడు. అంతే కాకుండా తన నెక్స్ట్ సినిమా “హ్యాపీ హార్డీ అండ్ హీర్”లో తనతో ఒక పాట పాడించనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు. అంతేకాదు ఆ పాటను హిమేష్ రేష్మియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఇపుడా వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. అంతేకాదు రనూ మండల్ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో ఈ పాట పాడినందకు రనూ మండల్‌కు హిమేష్ రేష్మియా దాదాపు రూ.6 నుంచి 7 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఇక రనూ మండల్ గాన మాధర్యానికి ముగ్దుడైన సల్మాన్ ఖాన్… తన లేటెస్ట్ మూవీ “దబాంగ్‌-3″లో ఒక పాట పాడటానికి అవకాశం ఇచ్చాడట. అంతేకాదు ఆమె కోసం ఏకంగా 55 లక్షల విలువైన ఇంటిని బహుమానంగా ఇచ్చినట్టు సమాచారం.

Related posts