telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పబ్‌జీ తిప్పలు : కాపురాలను కూడా .. కూల్చేస్తుంది..

10 arrested for playing online pubg game

పబ్‌జీ ఆట తో కొత్తకొత్త తిప్పలు వస్తున్నాయి. ఇప్పటివరకు బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్‌జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్నారు.. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పబ్‌జీ అదేపనిగా ఆడుతూ చాలామంది యువకులు నరాల బలహీనతతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా కూడా జనాల్లో చైతన్యం రావడం లేదు. ఇక ఓ వివాహిత పబ్‌జీ ఆటకు అలవాటు పడి సంవత్సరం కూడా నిండని పాపను సైతం వదిలి విడాకులు కోరడం గమనార్హం. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. 20 ఏళ్ల యువతికి బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న యువకుడితో పెళ్లి అయింది. వారికి సంవత్సరం వయసులోపు పాప ఉంది.

hyderabadi school student died on pubgపబ్‌జీ ఆటకు బానిసగా మారిన ఆ యువతి విడాకులు కావాలంటూ రచ్చకెక్కడం గమనార్హం. ఆ మేరకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి అభయం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి డైవోర్స్ ఇప్పించాలంటూ కోరింది. పబ్‌జీ ఆటలో భాగంగా పరిచయమైన యువకుడితో జీవితం పంచుకుంటుందట. ఆ మేరకు అభయం హెల్ప్ లైన్ కౌన్సిలర్లకు వివరించిందట. అప్పుడైతే ఇద్దరూ కలిసి ఒకే దగ్గర ఎంచక్కా గేమ్ ఆడుకోవచ్చని తెలిపిందట. ఆమె సమాధానానికి విస్తుపోయిన కౌన్సిలర్లు.. కొంతకాలం అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరంలో ఉండాలని సూచించారు. అయితే అక్కడ ఫోన్లు అనుమతించరు. ఆ విషయం తెలిసి సహాయక శిబిరానికి వెళ్లబోనంటూ మొండికేసింది.

అభయం హెల్ప్ లైన్‌కు తమ పిల్లలు పబ్‌జీ ఆటకు బానిసలయ్యారంటూ ఫోన్ కాల్స్ వస్తాయి. అయితే విచిత్రంగా నెలల వయసున్న కూతురిని కాదనుకుని.. ప్రేమగా చూసుకునే భర్తను వద్దనుకుని ఇలా విడాకుల కోసం రావడం ఇదే మొదటి కేసు అంటున్నారు నిర్వాహకులు. పబ్‌జీ మాయలో పడి తన జీవితం నాశనం చేసుకోవాలనుకుంటే చూస్తూ కూర్చోమంటున్నారు అభయం కౌన్సిలర్లు. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ద్వారా ఆమె మానసిక ప్రవర్తనలో మార్పు తెస్తామంటున్నారు.

call of game in mobile like pubgపలువురు పబ్‌జీ మాయలో పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ ఆటలో మునిగిపోయి నరాల బలహీనత కారణంగా ఇటీవల కొందరు చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. అదే ధ్యాసగా పబ్‌జీ ఆడుతుంటే మానసిక ప్రవర్తనలో తేడా కొడుతోంది. దాంతో కొందరు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. క్షణకాలం ఫోన్ చేతిలో లేకుండా అదోలా ఫీలవుతున్నారు. యువకులు బానిసలు కావడమే గాకుండా.. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న పబ్‌జీ ఆట కట్టెదెన్నడో!!

Related posts