telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చక్కటి పాదాల కోసం.. ఇలా..

tips for healthy heel

ఏమి చేసినా పాదాల పగుళ్లు తప్పడం లేదా … ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే మడమల సున్నితంగా మారటం లేదా ? ఈ సమస్య కారణంగా చాలామంది మహిళలు వారికి నచ్చిన చెప్పులు వేసుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అవి కనిపించకుండా ఉండే షూస్ ని మాత్రమే వారు వేసుకుంటుంటారు. ఈ సమస్య లేకుండా చిట్కాలు …

* 2 చెంచాల ఆముదం, 2 చెంచాల కొబ్బరి నూనె తీసుకొని అందులో అర చెంచా పసుపు కలిపి రోజూ పాదాలకు రాసుకొంటే పగుళ్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.

* గుప్పెడు వేపాకు, చిటికెడు చొప్పున పసుపు, సున్నం కలిపి మెత్తగా నూరి, అందులో 2 చెంచాల ఆముదం కలిపి పాదాలకు పట్టించిన పగుళ్ల సమస్య నయం అవుతుంది.

* గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పాదాలను ఆ నీటిలో ఉంచి తర్వాత ఫ్యూమ్ స్టోన్ తో మడమలు శుభ్రంగా రుద్దితే అక్కడ చేరిన మలినాలు, మృతకణాలు తొలగటమే గాక పగుళ్లు రావు.

* పగిలి ఇబ్బంది పెడుతున్న మడమలకు గుప్పెడు పండిన బొప్పాయి గుజ్జు లేదా రుబ్బిన గోరింటాకును రాసిన బాగా ఎండిన తర్వాత నీటితో కడిగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాలు పాటించి మీ పాదాలను అందంగా మార్చుకోండి. పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

Related posts