telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇకపై ఆ పాత్రలు చేయనంటున్న శృతి హాసన్

Shruthi-Hassan

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పీక్‌లో ఉన్న దశలోనే లండన్‌కు చెందిన గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. ఆ క్రమంలో కెరీర్‌ను కూడా నిర్లక్ష్యం చేసింది. అయితే మైకేల్‌తో ఆమె ప్రేమ ఎంతో కాలం కొనసాగలేదు. మైకేల్‌తో ప్రేమకు బ్రేకప్ చెప్పేసి మళ్లీ కెరీర్‌పై శృతి దృష్టి పెట్టింది. ‘కాటమరాయుడు’ తరువాత రెండు సంవత్సరాల పాటు ప్రేమ లోకంలో విహరించి ఈ మధ్యే సినీలోకంలోకి వచ్చింది. ఈ సందర్భంగా చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతున్నారట. తను సినిమాలు చేయడానికి రెడీ అనీ, కాకపోతే గతంలో చేసిన పాత్రలు ఇప్పుడు చేయలేనని చెబుతోందట. గతంలో తాను చేసిన పాత్రలకన్నా భిన్నంగా ఉన్న కథలతో వస్తే తప్పకుండా చేస్తానని అంటోందట. దీంతో సినీ జనాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts