telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

జగన్ ప్రమాణస్వీకారణకి .. హాజరవుతున్న సినీ ప్రముఖులు.. వీరే..

celebrities attending jagans oath program

జగన్ ప్రమాణ స్వీకారానికి రాబోయే సినీ హీరోల గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కార్య క్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు, అఆయన అభిమానులు జగన్ ఎప్పుడెప్పుడూ ప్రమాణ స్వీకారం చేస్తాడా అని వేచి చూస్తున్నారు . జగన్ పదేళ్లుగా కష్టపడుతున్న ఆయనకు ఇప్పటికి ఫలితం వచ్చింది. ప్రమాణస్వీకారానికి ఎవరెవరు ప్రముఖులు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్‌, తమిళనాడు డీఎమ్‌కే అధినేత స్టాలిన్‌లు వస్తున్నారు. వారితో పాటు ఇతర ప్రముఖులు కూడా తరలి రానున్నారు.

జగన్ ప్రమాణస్వీకారానికి టాలీవుడ్ ప్రముఖులు రానున్నట్లు సమాచారం. చిరంజీవి, నాగార్జునకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నాగార్జునకు జగన్ అత్యంత సన్నిహితుడు. పైగా ఎన్నికలకు ముందు కూడా ఆయన్ని వెళ్లి కలిసొచ్చాడు. పవన్ కు కూడా జగన్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రమాణస్వీకారానికి పవన్ వెల్లే సూచనలు కనిపించడంలేదు. జగన్, నాగార్జున కొన్ని వ్యాపారాల్లో కలిసే ఉన్నారు.దాంతో పాటు చిరంజీవి అంటే కూడా జగన్‌కు చాలా ఇష్టం. అందుకే ఆయనకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అందిందని తెలుస్తుంది. వీళ్లిద్దరూ జగన్ ప్రమాణ స్వీకారోత్సవంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఈ వేడుకులకు ఇంకెత మంది సినీ ప్రముఖులు హాజరవుతారో చూడాలి.

Related posts