telugu navyamedia
రాజకీయ

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలకు. ఏపీలో 11 స్థానాలకు ఎమ్మెల్సీ స్థానాలకు EC షెడ్యూలు విడుదల చేసింది.

తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అలాగే కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 ఎమ్మెల్సీ స్థానాలు ఇలా ఉన్నాయి అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2 మరియు ప్రకాశం-1

ఈ నేపథ్యంలో అన్నింటికీ కలిసి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ స్వీకరించనున్నారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26న ఉపసంహరణ, డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు..

ఎన్నికల షెడ్యూల్..

నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని, నామినేషన్లకు నవంబర్ 23 చివరి తేదీ.
నవంబర్ 24న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 26 చివరి తేదీ.
డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం ప్రక్రియ డిసెంబర్ 16 నాటికి ముగుస్తుంది.

Related posts