ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎక్సైజ్ చట్టం నేటి నుంచి ఆమ్లులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఎంత మద్యం కలిగి ఉండాలనే దానిపై పరిమితి విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం నేటి నుంచి నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది.
ఈ చట్టం ప్రకారంఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ 3 సీసాలు, ఫారిన్ లిక్కర్ 3 సీసాలు, మిథైలేట్ స్పిరిట్ 3 బల్క్‌లీటర్లు, బీర్ 6 సీసాలు (650 మి.లీ.), కల్లు 2 బల్క్‌లీటర్లను ఒక వ్యక్తి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా కలిగి ఉండవచ్చని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు.