telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

తగ్గిన పసిడి ధర… వెండి మాత్రం…!

Gold rates hike

మహిళలకు శుభవార్త… మగువలకు ఇష్టమైన బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. ఈరోజు కూడా బంగారం ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ.49,120కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గి రూ.53,580కి చేరింది. బంగారం ధరలు తగ్గితే, వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.66,350కి చేరింది. లాక్ డౌన్ కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.

Related posts