telugu navyamedia
రాజకీయ వార్తలు

సరిహద్దుల్లో చైనా ఎయిర్ బేస్ నిర్మాణం!

china flag

సరిహద్దు వివాదాలకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాంగ్ యాంగ్ సరస్సు పక్కనే నూతన ఎయిర్ బేస్ నిర్మాణాలను చేపడుతోంది. చేపట్టిన చైనా, డోక్లాం, నకుల్లా, సిక్కిం సెక్టార్ల సమీపంలో విమానాలను నిలిపేందుకు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిస్తోంది.

తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు ఈ విషయంపై సాక్ష్యాలను అందిస్తున్నాయి. డోక్లాం పీఠభూమిలో మూడు దేశాల (ఇండియా, భూటాన్, చైనా) ట్రై జంక్షన్ కు సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

గత మూడు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో చైనా, ఇండియాల మధ్య సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి 50 కిలోమీటర్ల దూరంలోనే చైనా కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయని ఉపగ్రహాల చిత్రాలు చూపుతున్నాయి.

డెటెస్ఫా పేరిట ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఈ చిత్రాలను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సరిహద్దులకు ఆవలి నుంచి వచ్చే క్షిపణులను ఛేదించేలా ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts