సామాన్య ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలను దోచుకుపోయిన ప్రముఖ జువెలరీ సంస్థ అధినేత, ఐఎంఏ యజమాని మన్సూర్ తో కలిసి కర్ణాటక సీఎం కుమారస్వామి కలిసున్న ఫొటోను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, “నేను తింటున్నాను… నీవు తిను” అన్న క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు కన్నడనాట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుండగా, మన్సూర్ లాంటి మోసగాడు ప్రజలను మోసగించి పరారయ్యాడని, అతను కుమారస్వామి మిత్రుడేనని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీనిపై కుమారస్వామి స్పందిస్తూ, ఎక్కడిదో పాత ఫొటోను పట్టుకొచ్చి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ చర్యలు తనకు బాధను కలిగించాయని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.