telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులతో 9 సారి చర్చలు జరపనున్న కేంద్రం…

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చట్టాలపై ఓ కమిటీని కూడా సుప్రీం కోర్టు వేసింది.. అయితే కొత్త వ్యసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక ఈ విషయం పై ఇప్పటికే ఎనిమిది సార్లు జరిపిన చర్చలు విఫలం కాగా.. తొమ్మిదో దఫా చర్చలు జరిపేందుకు సిద్ధమైంది కేంద్రం.. ఇవాళ రైతులు, ప్రభుత్వం మధ్య తొమ్మిదో విడత చర్చలు జరగనున్నాయి.. మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రులు.. సాగు చట్టాల రద్దు, విద్యుత్ విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక కేంద్ర చ‌ట్టాల‌ను ప‌రిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ తొలి స‌మావేశం ఈ నెల 19న జ‌రుగ‌నుంది. అయితే నిరసన తెలుపుతున్న రైతులతో చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి.. ఒక సభ్యుడు భూపీందర్ సింగ్ మాన్ తప్పుకొన్నారు. తాను నిష్పక్షపాతంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. తనను ఈ కమిటీలో నియమించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన భూపీందర్‌… రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై రైతుల నిరసన తీవ్రతరం కావడంతో.. సుప్రీంకోర్టు మంగళవారం ఈ చట్టాల అమలుపై స్టే విధించింది. నలుగురు వ్యవసాయ రంగ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Related posts