telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ విద్యా వార్తలు

నాలుగున్నర లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు.. ఇవే అర్హతలు..

ap village volunteer notification released

ఏపీ లో గ్రామ వాలంటీర్ పోస్టులపై గ్రామీణ యువత ఆసక్తి చూపుతున్నారు. ఆ పోస్టులకు విద్యార్హతలు ఏంటని..చాలా మందిలో ప్రశ్నలు తలెత్తాయి. పట్టణాల్లో వాలంటీర్ పోస్టులకు డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్మీడియెట్, గిరిజన-కొండ ప్రాంతాల్లో పదో తరగతి అర్హత ఉండాలని ఏపీ కేబినెట్ వెల్లడించింది. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని తెలిపింది. ఏపీలో మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు. వాలంటీర్‌కు రూ.5 వేలు జీతం(ఈ వేతనం 10 వేలకు పెంచినట్టు కూడా సమాచారం) ఉంటుంది. మంచి ఉద్యోగాలు వచ్చే వరకు తమ గ్రామంలోనే వాలంటీర్లుగా పనిచేయవచ్చు. మంచి ఉద్యోగాలు వచ్చే వరకు తమ గ్రామంలోనే వాలంటీర్లుగా పనిచేయవచ్చు. గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in వైబ్ సైట్ లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామ వాలంటీర్ కొరకు ధృవపత్రాలు :

1. ఆధార్ కార్డు

2. పదవ తరగతి సర్టిఫికెట్

3. స్టడీ సర్టిఫికెట్లు

4. మార్కుల లీస్టు (మొత్తం)ౌ

5. క్యాస్ట్ సర్టిఫికేట్

6.రెసిడెన్సీ సర్టిఫికెట్

7.వికలాంగులు అయితే (మెడికల్ సర్టిఫికెట్)

8.ఫోటో

9.సంతకం

Related posts