telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ప్లాస్టిక్ వ్యర్దాలు ఉంటె.. కాల్ చేయండి.. తీసుకెళతాం..

call service for plastic and compute waste

పీసీబీ నగరంలో వెలువడుతున్న వ్యర్థాల నిర్వహణపై విస్తృత చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం ఈ వేస్ట్ , ప్లాస్టిక్ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. తొలి ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని కొంపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని పీసీబీ అధికారులు బుధవారం ప్రారంభించనున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో, రీ – సైక్లింగ్ సంస్థ సహకారంతో నడిచే ఈ కేంద్రాల ద్వారా ఈ వ్యర్థాలను సేకరించనున్నారు. త్వరలోనే గచ్చిబౌలి, సనత్‌నగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో సైతం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి పనితీరును బట్టి మరికొన్ని సెంటర్లను నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో ప్రైవేట్‌రంగంలో నగరంలో 15 సంస్థలకు సేకరించుకొనే అవకాశం కల్పించినా, వ్యర్థాలను వేరుచేయడానికి 8 కేంద్రాలు, మరో మూడు ఈపీఆర్ కేంద్రాల ఏర్పాటు చేశారు. అయితే వీటి ఏర్పాటు వల్ల ప్రయోజనం లేకపోవడంతో పీసీబీ అధికారులే నేరుగా రంగంలోకి దిగారు. వెల్త్ అవుటాఫ్ వేస్ట్ (వ్యర్థాల నుంచి ఆదాయం ) నినాదంతో విస్త్రత ప్రచారం చేయనున్నారు. తొలి కేంద్రాన్ని కొంపల్లిలోని బృందావన్ కాలనీ శ్రీకాంత్ హైటెన్ నర్సరీలో ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాల సేకరణ కోసం 040 49171143 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

పాడయిపోయిన, పాతకంప్యూటర్లు, ల్యాబ్‌టాప్‌లు, మ్బైల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియోగేమ్ పరికరాలు, స్టీరియోలు, టేప్‌రికార్డర్లు, వాక్‌మెన్, కెమెరాలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కంటెయినర్లు, ప్టాస్టిక్, ప్యాకేజింగ్ సామగ్రిని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకెళతారు. భవిష్యత్తులో వ్యర్థాలు మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2001, ప్లాస్టిక్ వేస్ట్ హ్యాండ్లింగ్ రూల్స్ పేరుతో చట్టాలను తీసుకొచ్చింది. దీనిని పటిష్టంగా అమలు చేయకపోవడంతో 2012 మే 1 నుంచి బలవంతంగానైనా అమలు చేయాల్సిందేనని సీపీసీబీ ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం వ్యర్థాల నిర్వహణకు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పొందుపరిచింది. మెట్రో, ఐటీ రాజధానులుగా వెలుగొందుతున్న బెంగళూరు. పుణె, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇదే తరహాలో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ వ్యర్థాలను విజయవంతంగా సేకరిస్తున్నారు.

అక్కడి విధానాన్ని పరిశీలించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. మొదటి దశలో కాలనీవాసులే తీసుకొచ్చి వ్వర్థాలను సెంటర్ వద్దకు చేర్చాల్సి ఉండగా, రెండో దశలో కలెక్షన్ సెంటర్ వద్ద వ్యర్థాలను రవాణా చేయడానికి ఆటో ట్రాలీలను అందుబాటులో ఉంచనున్నారు. ఫోన్‌చేస్తే.. పీసీబీ సిబ్బందియే వచ్చి ఈ వ్యర్థాలను తీసుకెళతారు. కుప్పలు తెప్పలుగా.. హైదరాబాద్‌లో ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పోగవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. నగరాన్ని మొత్తంగా కాలుష్య కూపంగా మార్చేస్తున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను 28,749 మెట్రిక్ టన్నులు వ్యర్థాలు పోగయినట్లు ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ) అధ్యయనంలో తేలింది. 2014-15లో 3739 మెట్రిక్ టన్నులుగా ఉన్న వ్యర్థాలు ఒకే ఏడాదిలో 28 వేలకు చేరడం ఆందోళనకరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో వ్యర్థాల మరింతగా పోగవుతాయని, 2021-22 సంవత్సరానికి 50,335 టన్నులకు చేరుకొనే ప్రమాదం ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి ఈ వ్యర్థంతో ముప్పే.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ( ఈ వ్యర్థాల ) ఉత్పత్తి అత్యధికంగా ఉంది.

Related posts