telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

భీష్మ నుండి .. వాటే వాటే వాటే బ్యూటీ..

whatte whatte full song from bhishma

వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ఈసినిమా షూటింగ్‌ నిన్నటితో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా నుంచి రెండో పాటను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే అడ్నే ఊటీ’ అంటూ సాగే ఈపాట ప్రొమోను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం నేడు పూర్తి లిరికల్‌ పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రొమోను చూసిన సినీ ప్రియులు నితిన్‌, రష్మిక డ్యాన్స్‌కు మంత్రముగ్ధులయ్యారు. డ్యాన్స్‌ చాలా బాగుందంటూ కామెంట్లు కూడా చేశారు. ఫిబ్రవరి 21న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.                                             

Related posts