telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

తెలంగాణ గవర్నర్‌ తో చిరంజీవి భేటీ

Chiranjeevi Tamilsai telangana

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. ఈసందర్భంగా చిరంజీవి గవర్నర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తాను నటించిన సైరా నర్సింహారెడ్డిసినిమాను చూడాలని చిరంజీవి, గవర్నర్‌ను కోరారు. తాను సైరా సినిమా చూడాలనుకుంటున్నట్టు గవర్నర్‌ తెలిపారు.

ఈనెల 2న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం. దసరా పండుగ సెలవులు ఉండటంతో వసూళ్లు మున్ముందు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమా హిట్‌ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Related posts