telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక సమీక్ష నిర్వహించిన జగన్…

cm jagan ycp

పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనుల పురోగతిని సమీక్షించారు సీఎం జగన్. పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని సమావేశంలో ప్రస్తావించారు. స్పిల్‌ వే పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారులు.. ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని చర్చించినట్టుగా తెలుస్తోంది.. గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల వల్ల వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేశారు అధికారులు.. ఇక, మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో పోలవరం వద్ద వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణంపై కూడా సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా వైయస్సార్‌ గార్డెన్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు అధికారులు. పోలవరం వద్ద జీ హిల్‌ సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న వైయస్సార్‌ విగ్రహం.. ప్రకృతి సమతుల్యతను పెంచే విధంగా డిజైన్ ఉండాలని సూచించారు సీఎం.

Related posts