telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో జగన్ కు కరోనా పరీక్షలు!

jagan

కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న సీఎం జగన్ ఆ కిట్లను తన కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వైద్యులు సీఎం జగన్ కు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలో నెగెటివ్ వచ్చినట్టు స్పష్టమైంది. కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. తద్వారా కరోనా వ్యాప్తిని త్వరితగతంగా అరికట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది.

Related posts