telugu navyamedia
రాజకీయ వార్తలు

పదోసారి తాత అయిన డొనాల్డ్ ట్రంప్

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ భార్య లారా సోమవారం రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎరిక్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ఆ చిన్నారికి కరోలినా డోరోతి అని పేరు పెట్టారు. ఎరిక్ దంపతులకు ఇది రెండో సంతానం. వారి మొదటి సంతానమైన ఎరిక్ ల్యూక్ ట్రంప్‌కు ఈ సెప్టెంబరుతో రెండేళ్లు నిండనున్నాయి.

73 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యల ద్వారా ఐదుగురు సంతానం. వీరిలో మొదటి ఇద్దరు డొనాల్డ్‌ జూనియర్, ఇవాంకా ట్రంప్‌. మూడో సంతానం ఎరిక్‌. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌లో తన సోదరుడు డొనాల్డ్ జూనియర్‌తో కలిసి ఎరిక్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌‌గా ఉన్నారు. ట్రంప్‌నకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఎరిక్‌ చూసుకుంటారు.

Related posts