telugu navyamedia
రాజకీయ వార్తలు

జేఎన్‌యూ దాడి ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి: మాయావతి

mayawati

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు, టీచర్లపై జరైగిన దాడి ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.’జేఎన్‌యూలోని విద్యార్థులు, టీచర్లపై దాడి ఘటన సిగ్గుచేటన్నారు. తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించాలి. న్యాయవిచారణకు ఆదేశించాలి’ అని మయావతి సోమవారంనాడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆదివారంనాడు జేఎన్‌యూలోకి ప్రవేశించిన సుమారు 50 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ తమకు పలు ఫిర్యాదులు అందాయని, త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు ఘోష్‌తో పాటు సుమారు 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.

Related posts