telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ పై చర్యలు భారత్ అంతర్గత వ్యవహారం: అమెరికా

indian embassy 24 hrs help line for arrested in usa

జమ్ముకశ్మీర్ తాజా పరిణామాల పై అమెరికా స్పందించింది. కశ్మీర్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది.అయితే ఇది పూర్తిగా భారత్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. 370 ఆర్టికల్ రద్దు, జమ్ముకశ్మీర్ లో రాజ్యంగపరమైన మార్పులు తీసుకురావడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంపై భారత్ తమకు వివరించిందని తెలిపింది.

కొందరు రాజకీయవేత్తలను అరెస్ట్ చేశారనే వార్తలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని యూఎస్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ అన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ ను ఉద్దేశించి అమెరికా విదేశాంగశాఖ ఒక సూచన చేసింది. నియంత్రణ రేఖ వద్ద శాంతియుత వాతావరణం నెలకొనేలా పాక్ లోని అన్ని పార్టీలు వ్యవహరించాలని సూచించింది.

Related posts