telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్, బుచ్చిరెడ్డి పాలెం నగరపాలక పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని, బుచ్చిరెడ్డిపాలెం మునిసిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా నిలిచిన కుప్పం క్రమేణ బీటలు వారుతోంది. కుప్పంలో చంద్రబాబుకు బిగ్‌షాక్‌ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో 14 వార్డులకుగాను 13 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కౌంటింగ్‌ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.

కడపజిల్లా రాజంపేట మునిసిపాలిటీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. 29 వార్డుల్లో 24 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

Related posts