telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కోదండ రాముని కల్యాణోత్సవానికి హాజరైన సీఎం జగన్‌

*కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణ మహోత్సవం
*ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న సీఎం జగన్‌
*స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం తరపున  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

ముందుగా ఆల‌యం వ‌ద్దకు చేరుకున్న సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో కెఎస్. జవహర్ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగ‌తం ప‌లికారు.

అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ కు శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచ‌నం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్రప‌టం అంద‌జేశారు.

సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు.

Related posts