telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బొజ్జల ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు..ఏం చేశారంటే..?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బొజ్జల హైద‌రాబాద్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల అనంతరం ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

Image

శుక్రవారం బొజ్జల పుట్టిన రోజు కావడంతో చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని బొజ్జల ఇంటికి వెళ్లి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో బొజ్జలతో చంద్రబాబు కేక్ క‌ట్ చేయించారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబు కేక్ తినిపించారు.

బొజ్జల కుర్చీకే పరిమితం కావడంతో ఆయన్ను చంద్రబాబు పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని… జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts