telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడే మిలన్-2022 : ముఖ్య అథితిగా సీఎం వైఎస్ జ‌గ‌న్‌

విశాఖపట్నం సాగ‌ర‌తీరం మిలాన్‌ 2022 మెరుపులతో అంగరంగ వైభవంగా దర్శనమిస్తోంది. ఓ పక్క సముద్రం అంతా నౌకలతో నిండి ఉండగా, రోడ్లన్నీ రంగుల మయంగా దర్శనమిస్తున్నాయి.

2016లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించి సత్తా చాటిన మహా నగరం.. ఇటీవల ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూని కూడా ఘనంగా నిర్వహించిన విశాఖ మరో వేడుకకు ముస్తాబైంది.

Indian Navy's multilateral exercise 'MILAN 2022' to commence from 25th Feb in Visakhapatnam - NewsExpress

అయితే మిలన్-2022 విన్యాసాలు సాగర తీరంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు రెండు దశల్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, పలు దేశాలకు చెందిన నౌకలు విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. 27న జరుగనున్న ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు నమూనా విన్యాసాలను శనివారం సాయంత్రం ఆర్‌కె బీచ్‌లో నిర్వహించారు.

కేంద్ర సహాయమంత్రి అజయ్ భట్ చేతులు మీదుగా విలేజీ-2022ను అధికారికంగా ‌నిర్వహించారు. సముద్రిక ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టారు. వీటితో పాటు దేశీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆటబొమ్మలతో కూడిన గ్యాలరీని విశ్వప్రియ ఫంక్షన్‌ హాలు ఆవరణలో ఏర్పాటు చేశారు.

మిలన్ లో అతి ముఖ్యమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్ కార్య‌క్ర‌మంలో ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత నావల్‌ డాక్‌యార్డ్‌కు వెళ్లి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్‌ సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌–2022లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి గన్నవరం బయల్దేరుతారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు.

CM Jagan to take part in Milan parade on Sunday

 

ఈ కార్యక్రమంలో విన్యాసాలు, మెరైన్‌ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్‌ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. 

ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి.

మ‌రోవైపు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాధారణ జనాలను ఆదివారం సాయంత్రం వరకూ బీచ్‌లోకి రాకుండా ఆంక్షలు పెట్టారు.

 

Related posts