telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రధాని మోడీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఫోన్‌..

*భార‌త్ సాయం కోరిన ఉక్రెయ‌న్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ..

*మోదీతో మాట్లాడానంటూ ట్వీట్

*ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న దాడులు

*దాడుల‌పై విచారం వ్య‌క్తం చేసిన మోదీ ..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి మోదీకి వివరించారు.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఉక్రెయ‌న్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ.

సుమారు లక్ష మంది రష్యా బలగాలు తమ దేశంలోకి ప్రవేశించారని, తమ నివాస ప్రాంతాలపై కాల్పులు జరుపుతున్నారని మోడీతో తెలిపారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. అందరి మద్దతు ఉంటే రష్యా దురక్రమణను అపగలుగుతామని అన్నారు.

ఉక్రెయిన్​లో కొనసాగుతున్న సైనిక చర్య కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంపై.. విచార‌ణ‌ వ్యక్తం చేశారు మోదీ. వెంటనే దాడులను ఆపి, చర్చలు ప్రారంభించాలని ఉద్ఘాటించినట్లు పీఎంఓ తెలిపింది. శాంతి స్థాపన కోసం భారత్​ అన్ని విధాల కృషి చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చినట్లు పేర్కొంది.

ఉక్రెయిన్​లోని భారత పౌరులు, విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించింది.

మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో బాంబుల వర్షం కురుస్తోనే ఉంది. దీంతో అక్కడ ప్రజలు హడలెత్తిపోతున్నారు. చాలామంది ఆ దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు.

Related posts