ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చడం ఖాయమనే సంకేతాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గా చేయాలని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతా మోహన్ కోరారు. రాజధానిని దొనకొండకు మార్చడం మాత్రం కరెక్ట్ కాదని సూచించారు. తిరుపతిని రాజధాని చేయాలని చింతా మోహన్ సూచించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంతో చర్చలు జరిపారని చింతా మోహన్ పేర్కొన్నారు. రాజధాని విషయంలో జగన్ తొందరపడటం కరెక్ట్ కాదన్నారు. రాజధానికి దొనకొండ ఆమోదయోగ్యం కాదని అని ఆయన అన్నారు. అన్ని వనరులు ఉన్న తిరుపతిని రాజధాని చేయడం శ్రేయస్కరమని చెప్పారు. రాజధాని మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.