telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ సీఎం ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ…

cm jagan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ జరగనుంది. అయితే గత విచారణలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం జగన్ కు సంబంధించి స్టే లో ఉన్న నాలుగు కేసుల పై దూకుడు పెంచింది న్యాయస్థానం. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులలకు సంబంధించిన కేసుల పై విచారణ జరపనుంది. అయితే అరబిందో, హెటిరో సంస్థలకు క్విడ్‌ ప్రొ కో పై ఈడీ నమోదు చేసిన కేసును కోర్ట్ విచారణ జరపనుంది. ఇక ఇందూగ్రూపు, వాన్‌పిక్‌కు భూకేటాయింపులుపై 11 కేసులు నమోదు చేసింది సీబీఐ. ప్రస్తుతం స్టే ఉన్న కేసులను అలాగే మిగిలిన కేసులు మొత్తం కలిపి విచారణ చేయనుంది సీబీఐ కోర్టు. మరి ఈ విచారణలో తీర్పు వెలువడుతుందా.. లేదా మళ్ళీ విచారణ వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Related posts