లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో పరిమితంగా భక్తుల దర్శనాలకు టీటీడీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వారు కూడా కరోనా భయంతో స్వామి దర్శనానికి వచ్చేందుకు సుముఖంగా లేని సమయంలో కూడా భక్తులు బారులు తీరారు.
బుధవారం నాడు ఏకంగా 8,068 భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం 2,730 మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. లాక్ డౌన్ అనంతరం దర్శనాలను పునరుద్ధరించిన తరువాత రూ. 32 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.