ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీన మొదలై, నేటితో(17 డిసెంబర్ 2019) ముగియనున్నాయి. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును, అలాగే దిశ బిల్లును సభలో ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, అప్రకటిత విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగనుంది.
నేడు నూతన మద్యం విధానం, రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన 16 బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇవాళ శాసనమండలిలో అమరావతి నిర్మాణంపై చర్చ కొనసాగనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరగనుంది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవు: ఎమ్మెల్యే సీతక్క