కన్న పిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య హత్య చేసింది. అనంతరం ఇద్దరు పిల్లలను తన తండ్రి వద్ద విడిచిపెట్టి ఆ మహిళ ప్రియుడితో ఉడాయించింది. దీంతో కోపోద్రికులైన ఆ ఇద్దరు పిల్లలు మా నాన్నను చంపిన అమ్మను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన పంజాబ్‌లోని తర్న్ తరణ్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రాజ్‌ప్రీత్ సింగ్, సిమ్రాన్ కౌర్‌కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే గత కొంత కాలం నుంచి సిమ్రాన్.. లవ్‌ప్రీత్ సింగ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో పలుమార్లు రాజ్‌ప్రీత్, సిమ్రాన్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ వివాహేతర సంబంధాన్ని అడ్డుకునేందుకు సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని సిమ్రాన్‌కు సూచించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆదివారం రాత్రి రాజ్‌ప్రీత్‌కు ఆహారంలో విషమిచ్చింది. అయితే అతను కొనఊపిరితో ఉండడంతో ఉరేసి చంపేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లవ్‌ప్రీత్, సిమ్రాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదు..ఈటల సంచలన వ్యాఖ్యలు!