telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రమాణస్వీకారం చేయడం లేదు: అజిత్ పవార్

ajit-pawar- ncp

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ..ఈ రోజు తాను ప్రమాణస్వీకారం చేయడం లేదని అన్నారు. ఈ రోజు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఎవరుంటారనే అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇవాళ సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్కులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది.

ఎన్సీపీ నుంచి గెలిచిన అజిత్ పవార్ ఇటీవల బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసి, బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో రాజీనామా చేశారు. దీంతో చివరికి మళ్లీ అజిత్ పవార్ సొంత గూటికే చేరారు. ఉద్ధవ్ ప్రభుత్వంలో అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది.

Related posts