విక్టరీ ‘వెంకటేష్, వరుణ్ తేజ్’ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఎఫ్2 ( ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మించారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు అనీల్ . ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కనిపించనున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నా అదేమీ లేదని తేలిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తదుపరి ఎపిసోడ్ గా ఫ్యామిలీని సెట్స్ లోకి దించింది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు అనిల్ రావిపూడి సెట్ లోని ఓ ఫోటోను షేర్ చేసాడు. అయితే వెంకీ-వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్టులో నటించిన తమన్నా, మెహరీన్ “ఎఫ్ 3” లోనూ హీరోయిన్లుగా నటిస్తున్నారుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ సినిమా ఆగష్టు 27న రిలీజ్ అవ్వనుంది.
previous post
next post