telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశవ్యాప్త అత్యాచారాలపై .. సత్వర న్యాయవిచారణ.. తొవ్వుతున్న పెండింగ్ కేసులు(166000)..

supreme court cj

భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే దేశవ్యాప్తంగా అత్యాచారం, పోక్సోకు సంబంధించిన కేసులలో త్వరితగతిన విచారణ కోసం సుప్రీంకోర్టు జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ మొదట అన్ని ఎఫ్ఐఆర్ లు, చార్జిషీట్లు, ట్రయల్ కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తుంది. తరువాత భారత ప్రధాన న్యాయమూర్తికి తమ నివేదికను ఇస్తుంది. ఇటీవల నలుగురు నిందితులు హైదరాబాద్ కు చెందిన 26 ఏళ్ల పశువైద్యురాలిని అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేయడంతో.. మహిళలపై వరుస నేరాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందారు.

దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 1,66,000 కేసులను వేగంగా విచారించడానికి 1,023 ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ‘న్యాయ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల తరహాలో, మొత్తం 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను (ఎఫ్‌టిఎస్‌సి) ఏర్పాటు చేసి, అత్యాచారానికి సంబంధించిన కేసులను వేగవంతంగా విచారణ చేసి, సత్వర న్యాయాన్ని అమలుపరచడం కోసం భారత ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. దీని అంచనా వ్యయం రూ .767.25 కోట్లు. అందులో సెంట్రల్ షేర్ రూ. 474 కోట్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 218 ఎఫ్‌టిఎస్‌సిలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

Related posts