telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉండవల్లిలో సినిమా థియేటర్ సీజ్..

గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రదర్శన చేశారని రెవెన్యూ అధికారులు తాడేపల్లిమండలం ఉండవల్లిలో శ్రీరామకృష్ణ సినిమా థియేటర్ ను సీజ్ చేశారు. ఉండవల్లి సెంటరులోని శ్రీ రామకృష్ణ సినిమా హాల్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అఖండ సినిమాను బెనిఫిట్ షోకింద ప్రదర్శించారని అధికారులు చర్యలు తీసుకున్నారు.

సినిమా థియేటర్ నిర్వాహకులు అనుమతి పొందిన సమయం కంటే ముందుగా సినిమాను బెనిఫిట్ షో ప్రదర్శించారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, పోలీసు బందోబస్తు మధ్య సినిమా హల్ ను సందర్శించి సీజ్ చేశారు.

ఉండవల్లి లో నిబంధనలు పాటించని ఓ సినిమా థియేటర్ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

తదుపరి ఆదేశాల వరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని నిర్వాహకులును ఆదేశించారు. ఇప్పటికే బుకింగ్, ఆన్లైన్ లో టికెట్ లు కొనుగోలు చేసిన వారికి నగదు వాపసు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని ప్రేక్షకులు సినిమాథియేటర్ వద్ద ఆందోళనకు దిగారు.

Related posts