*జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..
*జల్లయ్య మృతదేహం బందువులకు అప్పగింత
*నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
*జల్లయ్య మృతదేహాన్ని రావులాపురం తరలింపుకు పోలీసులు యత్నం
*జల్లయ్య బందువులు ఆందోళన..నిందితులను అరెస్టే చేయాలని డిమాండ్
*అరవింద్‌బాబును అరెస్ట్ చేసిన పోలీసులు
*పోలీసులు, బంధువుల మధ్య వాగ్వాదం..
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం వైసీపీ శ్రేణులు దాడిలో మరణించిన టీడీపీ నేత జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు.
అయితే తమకు సంబంధం లేకుండా జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బంధువుల మధ్య తీవ్ర తోపులాట జరిగడంతో ఉద్రికత్తకు దారి తీసింది.
బంధువులను నెట్టివేసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వైద్యశాల నుండి అంబులెన్స్ లో బొల్లాపల్లి మండలం రావులాపురానికి తరలించారు పోలీసులు.
మరోవైపు జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటివద్దే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే జల్లయ్య అంత్యక్రియలలో పాల్గొని తీరతామని నేతలు అంటున్నారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది.