telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు..?

pallam raju congress

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ కేంద్రమంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు నియమించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పళ్లంరాజు కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందారు. 1989లో కాకినాడ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అనంతరం 1995లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రక్షణ మంత్రిగా కొనసాగారు. 2012లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ శాఖ మంత్రి నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పళ్లంరాజు తండ్రి శ్రీరామ సంజీవరావు కూడా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికై, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కుటుంబం సన్నిహితంగా ఉండడంతో పీసీసీ చీఫ్ గా పళ్లంరాజు కు అవకాశం కల్పించారని తెలుస్తోంది.

Related posts